Australian Open Asia Pacific: నగల్‌కు చైనా వీసా తిరస్కరణ
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:51 AM
భారత నెంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నగల్‌కు ఊహించని షాక్ తలిగింది. చైనాలోని చెంగ్డూలో ఈ నెల 24 నుంచి జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా-పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లే ఆఫ్ టోర్నీలో...
న్యూఢిల్లీ: భారత నెంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నగల్‌కు ఊహించని షాక్ తలిగింది. చైనాలోని చెంగ్డూలో ఈ నెల 24 నుంచి జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా-పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లే ఆఫ్ టోర్నీలో పాల్గొనేందుకు అతడికి వీసా లభించలేదు. తన వీసా దరఖాస్తును చైనా తిరస్కరించినట్టు నగల్ ఎక్స్‌లో పోస్టు చేశాడు. టాప్-100లో చోటు కోల్పోయిన సుమీత్.. ఈ టోర్నీలో నెగ్గితే వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు నేరుగా అర్హత సాధిస్తాడు. కాగా, తన వీసా ఎందుకు తిరస్కరణకు గురైందో సమాచారం లేదని నగల్ చెప్పాడు. చైనా సహా ఎన్నో దేశాల్లో జరిగిన టోర్నీల్లో పాల్గొన్నా.. తొలిసారి తనకు ఇలాంటి అనుభవం ఎదురైందని వాపోయాడు. వీలైనంత తొందరగా వీసా వచ్చేలా చొరవ తీసుకోవాలని చైనాలోని భారత దౌత్యకార్యాలయానికి విజ్ఞప్తి చేశాడు.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి