World Wrestling Championships: సుజీత్ పసిడిపట్టు
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:02 AM
అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ స్వర్ణం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల 65 కిలోల ఫైనల్లో కల్కల్ 10-0తో ఉమిడ్‌జోన్...
అండర్-23 వరల్డ్ రెజ్లింగ్
నోవి సాడ్ (సెర్బియా): అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ స్వర్ణం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల 65 కిలోల ఫైనల్లో కల్కల్ 10-0తో ఉమిడ్‌జోన్ జలోలోవ్ (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించాడు. 4 నిమిషాల 53 సెకన్లపాటు సాగిన బౌట్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కల్కల్ టెక్నికల్ సుపీరియారిటీతో గెలిచాడు. ఈ క్రమంలో అండర్-23లో వరల్డ్ టైటిల్ నెగ్గిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇదే టోర్నీలో గతేడాది కాంస్యం దక్కించుకొన్న కల్కల్.. ఈసారి పసిడి పతకాన్ని ముద్దాడాడు. 2022, 2025లో అండర్-23 ఆసియా టైటిళ్లు సాధించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News