Kris Srikkanth - Harshit Rana: విమర్శించడమే కాదు.. ప్రశంసించడమూ వచ్చు: మాజీ క్రికెటర్ శ్రీకాంత్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:31 PM
మూడో వన్డేలో హర్షిత్ అద్భుతమైన స్పెల్‌తో ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో శ్రీకాంత్ కూడా ఈ సారి విమర్శించడం మానేసి రాణాపై ప్రశంసల వర్షం కురింపించాడు.
టీమిండియా స్టార్ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana)కు జట్టులో చోటు ఇవ్వడంపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Kris Srikkanth) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘గంభీర్ మనిషి’ అంటూ తీవ్ర పదజాలం వాడాడు. తొలి రెండు వన్డేల్లో రాణా ప్రదర్శనపై విమర్శలు చేస్తూనే వస్తున్నాడు. అయితే మూడో వన్డేలో హర్షిత్ అద్భుతమైన స్పెల్‌తో ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో శ్రీకాంత్ కూడా ఈ సారి విమర్శడం మానేసి రాణాపై ప్రశంసల వర్షం కురింపించాడు.
‘తొలి రెండు వన్డేల్లో నిరాశపర్చినా.. మూడో వన్డేలో హర్షిత్ అదరగొట్టాడు. నాకు విమర్శించడమే కాదు.. ప్రశంసించడం కూడా తెలుసు. నా ప్రశంసలకు అతడు పూర్తి అర్హుడు. అతడి ఆటపట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతడి ఎంపికపై నేను చాలా విమర్శలు చేశా. వాటన్నింటికీ రాణా తన బంతితో ముగింపు ఇచ్చాడు. రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో టెయిలెండర్‌గా వచ్చి పరుగులు చేశాడు. ఇప్పుడు తొలి స్పెల్ నుంచే నాణ్యమైన బౌలింగ్ చేశాడు. అతడి ఆత్మవిశ్వాసం రోజు రోజుకూ పెరిగిపోతుంది. మూడో వన్డేలో చాలా కాన్పిడెంట్‌గా కనిపించాడు. అంతే దూకుడుగా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇందులో ఓవెన్‌ను ఔట్ చేసిన తీరు నాకెంతో నచ్చింది. ఇదే నా ఫెవరెట్ వికెట్. రాణా అద్భుతమైన బౌల్ చేశాడు.. అంతే అద్భుతంగా రోహిత్ శర్మ కూడా క్యాచ్ పట్టాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో చక్కటి బౌలింగ్ వేశాడు. మరీ ఎక్కువగా షార్ట్ బంతులు వేయలేదు. అలాగే స్లో బౌలింగ్ చేయలేదని శ్రీకాంత్ వెల్లడించాడు.
Also Read:
మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్..
జాగ్రత్త.. నకిలీ గుడ్లను ఇలా గుర్తించండి..