Asian Aquatics Championships: శ్రీహరి రజత కాంతులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:21 AM
ఆసియా అక్వాటిక్ చాంపియన్‌షిప్స్‌లో భారత 16 ఏళ్ల పతక నిరీక్షణకు ఏస్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ తెరదించాడు. పోటీలు ఆరంభమైన తొలి రోజే రెండు రజతాలతో సహా...
ఫ 16 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫ ఆసియా అక్వాటిక్స్ చాంపియన్‌షి్‌ప్స
అహ్మదాబాద్: ఆసియా అక్వాటిక్ చాంపియన్‌షిప్స్‌లో భారత 16 ఏళ్ల పతక నిరీక్షణకు ఏస్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ తెరదించాడు. పోటీలు ఆరంభమైన తొలి రోజే రెండు రజతాలతో సహా మూడు పతకాలతో మెరిశాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన తొలి భారత స్విమ్మర్‌గానూ రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన పురుషుల 200 మీ. ఫ్రీస్టయిల్‌లో శ్రీహరి ఒక నిమిషం 48.47 సెకన్ల టైమింగ్‌తో రజతం సొంతం చేసుకొన్నాడు. ఇక, 50 మీ. బ్యాక్ స్ట్రోక్‌లో 25.46 సెకన్ల టైమింగ్‌తో శ్రీహరి రెండో రజతం దక్కించుకొన్నాడు. 4్ఠ100లో దాస్, లిఖిత్ సెల్వరాజ్, బెనిసన్, శ్రీహరిల బృందం 3:40.87 సెకన్లలో పూర్తి చేసి కాంస్యం అందుకుంది. తెలంగాణకు చెందిన వ్రితి అగర్వాల్ మహిళల 1500 మీ. ఫ్రీస్టయిల్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి