Share News

Women World Cup: శ్రీలంక కివీస్‌ మ్యాచ్‌ రద్దు

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:04 AM

మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. శ్రీలంక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో...

Women World Cup: శ్రీలంక కివీస్‌ మ్యాచ్‌ రద్దు

నేటి మ్యాచ్‌

ఇంగ్లండ్‌ X పాకిస్తాన్‌

మ.3 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

మహిళల వన్డే వరల్డ్‌కప్‌

కొలంబో: మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. శ్రీలంక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు వర్షంతోనే రద్దు కావడం గమనార్హం. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్‌కు ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. అలాగే టాపార్డర్‌ మెరుగ్గా రాణించడంతో 50 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు సాధించింది. నీలాక్షి డిసిల్వా (55 నాటౌట్‌), ఓపెనర్‌ చమరి ఆటపట్టు (53) అర్ధసెంచరీలు సాధించగా.. హాసిని (44), విష్మి (42) సహకారం అందించారు. తొలి వికెట్‌కు చమరి, విష్మి 101 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. అలాగే నీలాక్షి తమ జట్టు తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (26 బంతుల్లో) పూర్తి చేసింది. సోఫీ డివైన్‌కు మూడు, బ్రీ లింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం కివీస్‌ ఇన్నింగ్స్‌ సమయానికి వర్షం ప్రారంభమైంది. మధ్యలో కాసేపు తెరిపినిచ్చినా ఫలితం లేకపోయింది. ఇక దాదాపు మూడు గంటల నిరీక్షణ తర్వాత రాత్రి 9.15 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక: 50 ఓవర్లలో 258/6 (నీలాక్షి 55, చమరి 53, హాసిని 44, విష్మి 42; డివైన్‌ 3/54, లింగ్‌ 2/39).

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 03:04 AM