Sri Lanka Tough Win: శ్రీలంక కష్టంగా
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:56 AM
తాజా ఆసియాక్‌పలో తొలిసారిగా ఉత్కంఠభరిత మ్యాచ్ చోటుచేసుకుంది. సోమవారం శ్రీలంకతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హాంకాంగ్ చివరి వరకు పోరాడింది. అయితే ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 నాటౌట్) స్వేచ్ఛగా...
ఆసియా కప్‌లో నేడు
అఫ్ఘానిస్తాన్ X బంగ్లాదేశ్
రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
పోరాడి ఓడిన హాంకాంగ్
ఆసియాకప్
దుబాయ్: తాజా ఆసియాక్‌పలో తొలిసారిగా ఉత్కంఠభరిత మ్యాచ్ చోటుచేసుకుంది. సోమవారం శ్రీలంకతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హాంకాంగ్ చివరి వరకు పోరాడింది. అయితే ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 నాటౌట్) స్వేచ్ఛగా ఆడడంతో మరో ఏడు బంతులుండగా 4 వికెట్ల తేడాతో లంక గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ (52 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ అన్షుమన్ రథ్ (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించింది. పేసర్ చమీరకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో లంక 18.5 ఓవర్లలో 153/6 స్కోరుతో నెగ్గింది. నిస్సాంక (68) అర్ధసెంచరీతో రాణించాడు. డెత్ ఓవర్లలో వేగంగా వికెట్లు కోల్పోయిన లంక ఓటమి దిశగా సాగింది. కానీ 18వ ఓవర్‌లో హసరంగ సిక్స్‌తో 14 రన్స్ రావడంతో మ్యాచ్‌పై హాంకాంగ్ పట్టు చేజారింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు జారవిడవడంతో ఆ జట్టు మూల్యం చెల్లించుకున్నట్టయ్యింది.
సంక్షిప్త స్కోర్లు: హాంకాంగ్: 20 ఓవర్లలో 149/4 (నిజాకత్ 52 నాటౌట్, అన్షుమన్ 48; చమీర 2/29). శ్రీలంక: 18.5 ఓవర్లలో 153/6 (నిస్సాంక 68, హసరంగ 20, పెరీర 20; ముర్తజా 2/37).
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News