Dunith Wellalage: వెల్లలగెకు పితృ వియోగం
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:34 AM
ఆసియాకప్ సూపర్-4లో ప్రవేశించిన శ్రీలంక జట్టు శిబిరంలో విషాదం అలుముకొంది. 22 ఏళ్ల యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగె తండ్రి సురంగ గుండెపోటుతో మరణించాడు....
అబుధాబి: ఆసియాకప్ సూపర్-4లో ప్రవేశించిన శ్రీలంక జట్టు శిబిరంలో విషాదం అలుముకొంది. 22 ఏళ్ల యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగె తండ్రి సురంగ గుండెపోటుతో మరణించాడు. గురువారం అఫ్ఘాన్‌తో మ్యాచ్ జరుగుతుండగానే ఈ వార్త జట్టు సిబ్బందికి తెలిసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాతే ఈ విషాదాన్ని దునిత్‌కు తెలిపారు. దీంతో వెంటనే అతను జట్టును వీడి స్వదేశానికి వెళ్లాడు. కెరీర్‌లో ఐదో టీ20 మ్యాచ్ ఆడిన వెల్లలగెకు ఇదే తొలి ఆసియాకప్. మరోవైపు అఫ్ఘాన్ ఇన్నింగ్స్‌లో వెల్లలగె చివరి ఓవర్ వేయగా.. నబీ వరుసగా ఐదు సిక్సర్లు బాది 32 రన్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే స్పిన్నర్ తండ్రి మరణ వార్త విని నబీ కూడా షాక్‌కు గురయ్యాడు.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి