Duleep Trophy 2025: కుప్పకూలిన సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:31 AM
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి రోజే తడబడింది. సెంట్ర ల్ జోన్ స్పిన్నర్లు సారాంశ్ జైన్ (5/49), కుమార్ కార్తికేయ (4/53) సుడులు తిరిగే బంతులతో...
బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి రోజే తడబడింది. సెంట్ర ల్ జోన్ స్పిన్నర్లు సారాంశ్ జైన్ (5/49), కుమార్ కార్తికేయ (4/53) సుడులు తిరిగే బంతులతో హడలెత్తించడంతో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 149 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తన్మయ్ (31) టాప్ స్కోరర్. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ నిలకడగా ఆడుతోంది. రోజు ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులతో నిలిచింది. క్రీజులో ఓపెనర్లు డానిష్ (28 బ్యాటింగ్), అక్షయ్ (20 బ్యాటింగ్) ఉన్నారు.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి