Keshav Maharaj: దక్షిణాఫ్రికా బోణీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:34 AM
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 3 వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (4/22), పేసర్ ముల్డర్ (3/33)ల ధాటికి...
ఇంగ్లండ్‌తో తొలి వన్డే
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 3 వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (4/22), పేసర్ ముల్డర్ (3/33)ల ధాటికి ఇంగ్లండ్ 24.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జేమీ స్మిత్ (54) మాత్రమే రాణించాడు. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20.2 ఓవర్లలో 137/3 స్కోరుతో నెగ్గింది. ఓపెనర్ మార్‌క్రమ్ (86), రికెల్టన్ (31 నాటౌట్) తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యంతో విజయాన్నందించారు. స్పిన్నర్ రషీద్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి