Smriti Mandhana: అవునుపెళ్లి చేసుకోబోతున్నాం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:55 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (29)కు, తనకు నడుమ ‘సమ్‌థింగ్..సమ్‌థింగ్’ ఊహాగానాలు నిజమేనని బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ పలాష్ ముచ్చల్...
ధ్రువీకరించిన పలాష్ ముచ్చల్
మంధానతో లవ్‌లో ఉన్నట్టు వెల్లడి
ఇండోర్: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (29)కు, తనకు నడుమ ‘సమ్‌థింగ్..సమ్‌థింగ్’ ఊహాగానాలు నిజమేనని బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ పలాష్ ముచ్చల్ (30) ధ్రువీకరించాడు. తామిద్దరం లవ్‌లో ఉన్నట్టు వెల్లడించాడు. త్వరలో తాము వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్టు కూడా చెప్పాడు. ‘మంధాన ఇండోర్ కోడలు కాబోతోంది’ అని పలాష్ తెలిపాడు.
ఎవరీ పలాష్..: ఇండోర్‌లోని మార్వాడీ కుటుంబానికి చెందిన పలాష్ ముచ్చల్.. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందాడు. ప్రముఖ గాయకుడిగా, సంగీత దర్శకుడిగానూ బాలీవుడ్‌లో పేరుపొందాడు. శిల్పా శెట్టి చిత్రం ‘డిష్క్యావ్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. 2019 నుంచి పలాష్, స్మృతి డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసున్న ఫొటోలు పలుమార్లు సోషల్‌మీడియాలో వైరల్ అయినా మంధాన కానీ, ముచ్చల్ కానీ వాటిపై స్పందించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News