సిన్నర్ జొకో ముందుకు
ABN , Publish Date - May 30 , 2025 | 04:33 AM
టాప్ సీడ్ జానిక్ సిన్నర్‌తోపాటు మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, అలెగ్జాండర్ జ్వెరెవ్, కొకొ గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్...
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: టాప్ సీడ్ జానిక్ సిన్నర్‌తోపాటు మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, అలెగ్జాండర్ జ్వెరెవ్, కొకొ గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో వరల్డ్ నెం:1 సిన్నర్ (ఇటలీ) 6-3, 6-0, 6-4తో రిచర్డ్ గాస్‌క్వెట్ (ఫ్రాన్స్)పై వరుస సెట్లలో గెలిచాడు. మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 3-6, 6-1, 6-2, 6-3తో జాస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)ను, రుబ్లేవ్ 7-6(1), 6-1, 7-6(5)తో ఆదమ్ వాల్టన్‌ను, ఆరో సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 7-6(1) కోరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్)ను ఓడించారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 6-2, 6-4తో టెరెజా వెలెంటోవా (చెక్)పై, జెస్సికా పెగులా 6-3, 7-6(3)తో అన్ లిపై, ఆరో సీడ్ మిర్రా ఆండ్రీవా 6-3, 6-4తో అష్లిన్ క్రూగర్‌పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6-1, 6-3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై, పౌలా బడోసా 3-6 6-4, 6-4తో ఎలెనా గాబ్రియెలా రూజ్‌పై నెగ్గారు.
ఇవి కూడా చదవండి..
IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి