Share News

Badminton World Championships 2025: సింధు సేన్‌కు సవాల్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:17 AM

ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించిన సింధు ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌లో సాగుతోంది. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌...

Badminton World Championships 2025: సింధు సేన్‌కు సవాల్‌

ప్రపంచ చాంపియన్‌షి్‌ప నేటి నుంచి

పారిస్‌: ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించిన సింధు ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌లో సాగుతోంది. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. సోమవారం నుంచి జరిగే ప్రపంచ టోర్నీ తొలి రౌండ్‌లో కలోయానా నల్బంటోవాతో సింధు తలపడనుంది. ఒకవేళ ముందుకు సాగితే ప్రీక్వార్టర్స్‌లో వరల్డ్‌ నెం.2 వాంగ్‌ జి యి రూపంలో సింధుకు గండం పొంచి ఉంది. లక్ష్య సేన్‌, ప్రణయ్‌ ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీ్‌సలో ఓటమి తర్వాత సేన్‌ కోలుకోలేక పోతున్నాడు. తొలి రౌండ్‌లో షి యు కితో సేన్‌, జోయాకిమ్‌తో ప్రణయ్‌ ఆడనున్నారు. డబుల్స్‌లో 9వ సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌, మిక్స్‌డ్‌లో ధ్రువ్‌-తనీషా జంటలకు తొలిరౌండ్‌లో బై లభించింది. హరిహరన్‌-రుబన్‌, ప్రియ-శ్రుతి, రితు-శ్వేత, రోహన్‌-రుత్విక శివాని జోడీలు బరిలో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:17 AM