Asia Shooting Championship: సిఫ్ట్ కౌర్ డబుల్ గోల్డ్
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:05 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా డబుల్ ధమాకా సృష్టించింది. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో...
ఆసియా షూటింగ్
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా డబుల్ ధమాకా సృష్టించింది. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో చైనా షూటర్ యాంగ్ యూజీ (458.8 పాయింట్లు)ని ఓడించిన కౌర్ (459.2) పసిడి నెగ్గింది. ఇక, టీమ్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్, ఆషి చోక్సీ, అంజుమ్ మౌద్గిల్ త్రయం ఫైనల్లో 1753 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడి పతకాన్ని నెగ్గింది. మరోవైపు జూనియర్ షూటర్లు పతకాల పంట పండించారు. జూ. మహిళల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్‌లో అనుష్క వ్యక్తిగత స్వర్ణంతోపాటు ప్రాచీ గైక్వాడ్, మహిత్ సంధుతో కలసి టీమ్ పసిడిని కూడా సొంతం చేసుకొంది. పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ టీమ్ ఈవెంట్‌లో సూరజ్, అభినవ్, సమీర్‌ల టీమ్ స్వర్ణం సాధించగా.. ఇదే ఈవెంట్‌లో సమీర్‌కు వ్యక్తిగత కాంస్యం దక్కింది. మహిళల ట్రాప్‌లో హరీస్, ఆద్య స్వర్ణ, రజతాలు గెలిచారు. ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో సబీరా, ఆద్య, భవ్య త్రిపాఠిల త్రయం, పురుషుల్లో అర్జున్, ఆర్యవంశ్, ఉద్ధవ్ రాథోడ్‌ల టీమ్‌లు బంగారు పతకాలు కొల్లగొట్టాయి. ఆర్యవంశ్ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి