Shubhman Gill: ఈ ఓటమిలో సానుకూల అంశం అదే: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:35 PM
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓటమిపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ బ్యాటర్లను కోల్పోయాక కోలుకోలేక పోయామని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర ఓటమి చవి చూసింది. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో చివరకు పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించారు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో కోలుకోలేకపోయామని చెప్పాడు. ‘పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయాక మళ్లీ కోలుకోవడం ఎప్పుడూ కష్టమే. ఆ తరువాత మ్యాచ్ అంతా ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి శ్రమపడాల్సి వస్తుంది’ అని అన్నాడు (Subman Gill on Ind Losing in Ist ODI).
ఈ మ్యాచ్‌తో నేర్చుకోవాల్సిన విషయాలు, సానుకూల అంశాలు కూడా ఉన్నాయని శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఎప్పుడు బరిలో ఉన్నా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇది తమ అదృష్టమని కామెంట్ చేశాడు. త్వరలో జరగనున్న రెండో వన్డేలో కూడా ఇలాగే అభిమానులు అండగా ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా ముందున్న లక్ష్యం స్వల్పమైనదే అయినా విజయం కోసం వారిని శ్రమించేలా చేశామని చెప్పాడు. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని అన్నాడు. ఈ విషయం తనకు సంతృప్తిని ఇచ్చిందని కామెంట్ చేశాడు.
ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డేలో భారత్ ఘోర ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో సవరించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఏడు వికెట్లు ఉండగానే ఛేదించి విజయం సాధించింది. 46 పరుగులతో అజేయంగా నిలిచిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
IND VS AUS: తొలి వన్డేలో భారత్ ఓటమి..
చిన్న మిస్టేక్.. మిచెల్ స్టార్క్ వరల్డ్ రికార్డ్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి