Share News

Shreyas Iyer Recovering Quickly: కోలుకుంటున్న శ్రేయాస్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:24 AM

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్‌ అయ్యర్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడికి చిన్నపాటి శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం...

Shreyas Iyer Recovering Quickly: కోలుకుంటున్న శ్రేయాస్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్‌ అయ్యర్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడికి చిన్నపాటి శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం. మూడో వన్డేలో అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టే క్రమంలో కిందపడిన అయ్యర్‌ పక్కటెముకలకు గాయమైంది. స్కానింగ్‌లో ప్లీహం రక్తస్రావానికి గురైందని తేలడంతో రెండురోజులు ఐసీయూలోనే ఉంచి, ఆ తర్వాత స్పెషల్‌ వార్డుకు మార్చారు. మంగళవారం తీసిన స్కానింగ్‌లో రక్తస్రావం ఆగినట్టు తేలిందని, అతను వేగంగా కోలుకుంటున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా పేర్కొన్నారు. డాక్టర్లు ఊహించినదానికంటే అత్యంత వేగంగా అయ్యర్‌ కోలుకుంటున్నాడన్నారు. టీమ్‌ డాక్టర్‌ రిజ్వాన్‌ ఖాన్‌ శ్రేయాస్‌ వెంటే ఉండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అటు టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ సైతం శ్రేయాస్‌ ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా ఉందని, ఇప్పటికే పలుమార్లు అతడితో ఫోన్‌లో మాట్లాడానని చెప్పాడు. మరో వారంరోజుల విశ్రాంతి తర్వాత శ్రేయా్‌సను డిశ్చార్జి చేసే అవకాశముందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 06:24 AM