Tilak Varma: అయ్యర్ స్థానంలో తెలుగోడికి ఛాన్స్!
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:05 AM
భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ప్రారంభం కానుంది.
క్రీడా వార్తలు: భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer injury) ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు సిడ్నీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిణామం భారత్ కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయ్యర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయాలు ప్రారంభించిందని సమాచారం. అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతుంటాడు. ఈ స్థానాన్ని భర్తీ కోసం ముగ్గురు పేర్లు వినిపిస్తుండగా.. వారిలో తెలుగోడు తిలక్ వర్మ పేరు కూడా ఉందని తెలుస్తోంది.
శ్రేయస్ అయ్యర్ స్థానం భర్తీ చేసేందుకు మొదటగా సంజూ శాంసన్(Sanju Samson) పేరు వినిపిస్తోంది. గత వన్డే సిరీస్‌లో సంజూ చూపిన అద్భుతమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని అతనికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆడిన 16 వన్డే మ్యాచ్‌లలో 56.66 అద్భుతమైన సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక జాబితాలో వినిపిస్తోన్న రెండో పేరు తిలక్ వర్మ. గత నెలలో ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ(Tilak Varma) రాత్రికి రాత్రే స్టార్‌గా మారాడు. యువ ఆటగాడైన తిలక్ వర్మను ఎంపిక చేస్తే దక్షిణాఫ్రికా సిరీస్‌లో నంబర్ 4లో భారత బ్యాటింగ్‌కు మరింత బలం, దూకుడు లభిస్తాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
ఇక మూడో ఆప్షన్‌గా రియాన్ పరాగ్(Riyan Parag) వినిపిస్తోంది. ఇతడు గత ఏడాది శ్రీలంకతో వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. గాయం కారణంగా జట్టు నుంచి దూరమయ్యాడు. పరాగ్ ఆడిన ఒక్కే ఒక వన్డేలో 15 పరుగులు చేశాడు. అలానే 9 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ముగ్గురు ప్లేయర్లలో సంజూ శాంసన్ అత్యుత్తమ వన్డే సగటును కలిగి ఉండటం వల్ల శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని(Shreyas Iyer replacement) భర్తీ చేయగల ప్లేయర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తిలక్ వర్మ అయితే 4వ స్థానానికి బలమైన వ్యక్తిగా ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, తుది ఎంపిక జట్టు అవసరాలు, సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
West Indies Beats Bangladesh: బంగ్లాపై వెస్టిండీస్ ఘన విజయం
Yashasvi Jaiswal Key Decision: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం