World Para Archery Championships 2025: వావ్ శీతల్
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:21 AM
భారత ఆర్చర్ శీతల్ దేవి చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్సలో ఆమె పసిడి పతకం కొల్లగొట్టింది. తద్వారా ఈ టోర్నీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన చేతులు లేని తొలి మహిళా...
పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో చరిత్ర
మొత్తం 3 పతకాలతో అదరగొట్టిన కశ్మీర్ ఆర్చర్
గ్వాంగ్జూ (దక్షిణ కొరియా): భారత ఆర్చర్ శీతల్ దేవి చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్సలో ఆమె పసిడి పతకం కొల్లగొట్టింది. తద్వారా ఈ టోర్నీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన చేతులు లేని తొలి మహిళా ఆర్చర్‌గా శీతల్ రికార్డు నెలకొల్పింది. 18 ఏళ్ల శీతల్ హోరాహోరీ ఫైనల్లో 146-143తో వరల్డ్ నెం.1 ఆర్చర్ ఒజ్నూర్ క్యూర్ గిర్డీ (టర్కీ)ని చిత్తుచేసి ప్రపంచ టైటిల్ అందుకుంది. అంతేకాదు..మిక్స్‌డ్, మహిళల టీమ్ విభాగాల్లోనూ పతకాలు సాధించి మొత్తం మూడు మెడల్స్‌తో అదరగొట్టింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన శీతల్ పాదాలు, భుజం ఉపయోగించి బాణాలు సంధిస్తుంది. టోర్నీలో చేతులు లేకుండా పోటీపడుతున్న ఏకైక ఆర్చర్ దేవినే కావడం విశేషం. పారా ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో గతంలో చేతులులేని ఆర్చర్ పతకం గెలవడం పురుషుల విభాగంలో చోటుచేసుకుంది. ఇక, తాజా టోర్నీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ టోమన్ కుమార్ పసిడి పతకంతో మెరిశాడు. ఫైనల్లో భారత్‌కే చెందిన రాకేశ్ కుమార్ పోటీ నుంచి వైదొలగడంతో టోమన్‌కు స్వర్ణం దక్కింది. పసిడితో చరిత్ర సృష్టించిన శీతల్.. టోమన్ జతగా కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం అందుకుంది. కాంపౌండ్ మహిళల టీమ్ కేటగిరీ ఫైనల్లో ఓటమి చవిచూసిన శీతల్/సరిత జోడీ రజతంతో సరిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి