Tennis Hall of Fame: దిగ్గజాల సరసన
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:22 AM
మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, డబుల్స్ లెజెండ్స్ బ్రయాన్ బ్రదర్స్‌కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో షరపోవాతోపాటు మైక్, బాబ్ బ్రయాన్‌ల పేర్లను...
హాల్ ఆఫ్ ఫేమ్‌లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్ (యూఎస్): మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, డబుల్స్ లెజెండ్స్ బ్రయాన్ బ్రదర్స్‌కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో షరపోవాతోపాటు మైక్, బాబ్ బ్రయాన్‌ల పేర్లను దిగ్గజాల సరసన చేర్చారు. ఈ కార్యక్రమానికి అమెరికా టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ ప్రత్యేక అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపర్చింది. స్టేజ్ వెనుక నుంచి రంగప్రవేశం చేసిన సెరెనా.. ‘మాజీ ప్రత్యర్థి, మాజీ అభిమాని.. చిరకాల స్నేహితురాలు’ అంటూ షరపోవాను సభకు పరిచయం చేసింది. ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్‌లో మరియా షరపోవాను చేర్చుతున్నట్టు ప్రకటించింది.

షెల్టన్, రదుకాను శుభారంభం: మాజీ చాంపియన్ ఎమ్మా రదుకాను, ఆరో సీడ్ బెన్ షెల్టన్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రదుకాను 6-1, 6-2తో షిబహారాపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో వోండ్రుసోవా 6-3, 7-6 (3)తో సెలెఖెమెటోవాని, 31వ సీడ్ ఫెర్నాండెజ్ 6-2, 6-1తో మరీనోను ఓడించి రెండో రౌండ్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో షెల్టన్ 6-3, 6-2, 6-4తో బుసెపై , 16వ సీడ్ మెన్సిక్ 7-6(5), 6-3, 6-4తో జారీపై, 18వ సీడ్ డవిడోవిచ్ 6-1, 6-1, 6-2తో షెవ్‌చెంకోపై నెగ్గారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News