Share News

BWF World Tour Finals: సెమీస్‌కు సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:29 AM

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన

BWF World Tour Finals: సెమీస్‌కు సాత్విక్‌ జోడీ

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

హాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ ఆఖరి, మూడో మ్యాచ్‌లో మూడోసీడ్‌ సాత్విక్‌ ద్వయం 17-21, 21-18, 21-15తో చిరకాల ప్రత్యర్థి జంట, పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఆరోన్‌ యా/సో వూ యిక్‌ (మలేసియా)ను చిత్తు చేసింది. గంటకుపైగా సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ కోల్పోయినా వెరవని భారత జోడీ.. తర్వాతి రెండు గేముల్లో అద్భుతంగా పుంజుకుంది.. దీంతో వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన సాత్విక్‌ జంట.. గ్రూప్‌ టాపర్‌గా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో భారత్‌ తరఫున ఈ మెగా టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి పురుషుల డబుల్స్‌ జంటగా సాత్విక్‌/చిరాగ్‌ రికార్డుకెక్కారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 04:29 AM