China Masters Badminton: సాత్విక్ జోడీకి రజతమే
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:34 AM
భారత టాప్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టికి వరుసగా రెండో ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. గతవారం హాంకాంగ్ ఓపెన్ తుది...
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్
షెన్‌జన్: భారత టాప్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టికి వరుసగా రెండో ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. గతవారం హాంకాంగ్ ఓపెన్ తుది పోరులో ఓడిన సాత్విక్ జోడీ.. ఆదివారం జరిగిన చైనా మాస్టర్స్‌లో వరల్డ్ నెం:1 జోడీ కిమ్ వోన్ హో-సియో సియింగ్ సొ చేతిలో పరాజయం పాలయ్యారు. సాత్విక్-చిరాగ్ ద్వయం 19-21, 15-21తో కొరియాకు చెందిన కిమ్-సియో చేతిలో వరుస గేముల్లో చిత్తయింది. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా? అన్నట్టుగా తలపడినా 6-7 వద్ద వరుసగా 8 పాయింట్లు సాధించిన భారత షట్లర్లు 14-7తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కానీ, వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం ఇవ్వడంతో గెలవాల్సిన గేమ్ చేజారింది. ఇక, రెండో గేమ్‌లో సాత్విక్ ద్వయం 9-7తో ముందంజలో నిలిచినా.. కొరియా జంట 10-10తో స్కోరు సమం చేసింది. ఈ దశలో తడబడిన సాత్విక్-చిరాగ్ 11-15తో వెనుకబడ్డారు. అయితే, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా కిమ్ జోడీ మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి