China Masters Badminton: సెమీస్‌లో సాత్విక్ జోడీ
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:54 AM
గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో రన్నర్‌పగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ వరుసగా రెండో టోర్నీలోనూ సత్తా చాటుతోంది. ఈ భారత జంట చైనా మాస్టర్స్‌లో సెమీఫైనల్‌కు...
సింధుకు మళ్లీ నిరాశ
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్
షెన్‌జెన్ (చైనా): గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో రన్నర్‌పగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ వరుసగా రెండో టోర్నీలోనూ సత్తా చాటుతోంది. ఈ భారత జంట చైనా మాస్టర్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, సింగిల్స్ ఏస్ షట్లర్ పీవీ సింధు మరోసారి నిరాశపరుస్తూ క్వార్టర్‌ఫైనల్‌తోనే తన పోరాటాన్ని ముగించింది. సింధు 14-21, 13-21తో టాప్ సీడ్, ఒలింపిక్ చాంపియన్ అన్ సే యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఇక 8వ సీడ్ సాత్విక్/చిరాగ్ ద్వయం 21-14, 21-14తో చైనా జంట రెన్ గ్జియాంగ్ యు/గ్జీ హావోనాన్‌ను ఓడించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో రెండో సీడ్, మలేసియా జంట ఆరోన్ చియా/సో వూయి యిక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి