Share News

China Masters 2025: ప్రీక్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:51 AM

డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ పోరులో...

China Masters 2025: ప్రీక్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

‘చైనా మాస్టర్స్‌’ నుంచి లక్ష్యసేన్‌ అవుట్‌

షెన్‌జెన్‌ (చైనా): డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ పోరులో సాత్విక్‌ జంట 24-22, 21-13తో మలేసియా ద్వయం జునైది ఆరి్‌ఫ/రాయ్‌ కింగ్‌ యాప్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. కాగా, సింగిల్స్‌లో భారత స్టార్‌ లక్ష్యసేన్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. లక్ష్య 11-21, 10-21తో ఫ్రాన్స్‌ షట్లర్‌ తోమా జూనియర్‌ పొపోవ్‌ చేతిలో ఓడి తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా, మహిళల డబుల్స్‌లో రీతూపర్ణ /శ్వేతాపర్ణ జోడీలు మొదటి రౌండ్లోనే ఓడారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 05:51 AM