Share News

Sanjay Manjrekar: ఈ ఐపీఎల్ సీజన్ ముఖ్య బ్యాటర్ల లిస్టులో కోహ్లీకి దక్కని చోటు.. సంజయ్ మంజ్రేకర్‌పై జనాలు గుస్సా

ABN , Publish Date - Apr 27 , 2025 | 09:30 AM

సంజయ్ మంజ్రేకర్ రూపొందించిన మేటి ఐపీఎల్ బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీకి స్థానం లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Sanjay Manjrekar: ఈ ఐపీఎల్ సీజన్ ముఖ్య బ్యాటర్ల లిస్టులో కోహ్లీకి దక్కని చోటు.. సంజయ్ మంజ్రేకర్‌పై జనాలు గుస్సా
Sanjay Manjrekar Batters that Matter List

ఇంటర్నెట్ డెస్క్: మనసులో ఉన్నది సూటిగా చెప్పే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నిత్యం తన కామెంట్స్‌తో జనాల్లో చర్చను రేకెత్తిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ సీజన్‌లో బ్యాటర్ల పర్‌ఫార్మెన్స్‌పై ఆయన చేసిన కామెంట్.. విరాట్ కోహ్లీ అభిమానుల్లో అసంతృప్తికి దారి తీసింది. ఈ సీజన్‌లో ప్రధానమైన బ్యాటర్ల లిస్టును విడుదల చేసిన సంజయ్ మంజ్రేకర్ కొత్త చర్చకు తెరలేపారు.

‘‘బ్యాటింగ్‌కు సంబంధించినంత వరకూ మనందరం దృష్టి పెట్టాల్సిన ఒకే ఒక లిస్టు ఇది. వీళ్లు టాప్ పరుగులతో పాటు మంచి రన్ రేట్ కూడా సాధించారు’’ అంటూ మంజ్రేకర్ ఓ జాబితా షేర్ చేశారు. ఈ సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వారికి తన జాబితాలో చోటు కల్పించారు. అయితే, టాప్ స్కోరర్లుగా ఉన్న కింగ్ కోహ్లీ, సాయి సుదర్శన్, ఎయిడెన్ మార్క్రమ్‌కు మాత్రం ఇందులో చోటు దక్కలేదు.


  • పూరన్: 377 పరుగులు, ఎస్ఆర్ 205

  • ప్రియాంశ్ ఆర్య: 254 పరుగులు, ఎస్ఆర్ 202

  • శ్రేయాస్: 263 పరుగులు, ఎస్ఆర్ 185

  • సూర్య: 373 పరుగులు, ఎస్ఆర్ 167

  • బట్లర్: 356 పరుగులు, ఎస్ఆర్ 166

  • మిచెల్ మార్ష్: 344 పరుగులు, ఎస్ఆర్ 161

  • ట్రావిస్ హెడ్: 261 పరుగులు, ఎస్ఆర్ 159

  • క్లాసెన్: 288 పరుగులు, ఎస్ఆర్ 157

  • కేఎల్ రాహుల్: 323 పరుగులు, ఎస్ఆర్ 154

  • గిల్: 305 పరుగులు, ఎస్ఆర్ 153


కోహ్లీ, సాయి సుదర్శన్, యశస్వీ జైశ్వాల్, ఎయిడెన్ మార్క్రమ్ ఈ సీజన్‌లో టాప్ స్కోరర్లుగా, టాప్ టెన్ స్థానాల్లో ఉన్నప్పటికీ ఈ జాబితాలో మాత్రం చోటు దక్కలేదు. మంజ్రేకర్ ఎంచుకున్న క్రైటీరియా ప్రకారం, వారి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటంతో జాబితాలో చోటులేకుండా పోయింది.

ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సాయి సుదర్శన్‌ ఇప్పటివరకూ 417 పరుగులు చేశాడు. అతడి సగటు పరుగులు 52.13 కాగా స్ట్రైక్ రేట్ 152.18. కోహ్లీ స్ట్రైక్ రేట్ 144.11గా ఉన్నప్పటికీ ఈ సీజన్ టాప్ స్కోరర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 392 పరుగులు చేశాడు. ఇక 326 పరుగులు చేసిన మార్క్రమ్ స్ట్రైక్ రేటు 150.92గా ఉంది. సీజన్‌లో ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈ ముగ్గురినీ మంజ్రేకర్ పక్కనపెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే

IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్

ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 10:26 AM