Share News

US Open 2025: సబలెంక అల్కారజ్‌ ముందంజ

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:24 AM

ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ల పయనం సాఫీగా సాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ అల్కారజ్‌ 6-1, 6-0, 6-3తో మాటియా బెలూసీ (ఇటలీ)పై గెలుపొందాడు. షెల్టన్‌ 6-4, 6-4, 6-2తో కరెనోపై...

US Open 2025: సబలెంక అల్కారజ్‌ ముందంజ

  • ఓస్టాపెంకో తిరుగుముఖం

  • యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ల పయనం సాఫీగా సాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ అల్కారజ్‌ 6-1, 6-0, 6-3తో మాటియా బెలూసీ (ఇటలీ)పై గెలుపొందాడు. షెల్టన్‌ 6-4, 6-4, 6-2తో కరెనోపై, జ్వెరెవ్‌ 6-2, 7-6 (4), 6-4తో తిబీలోపై, టేలర్‌ ఫ్రిట్జ్‌ 4-6, 7-6 (3), 6-2, 6-4తో హారి్‌సపై, జొకోవిచ్‌ 6-7 (7), 6-3, 6-3, 6-1తో సజ్డాపై, 17వ సీడ్‌ టియఫో 6-4, 7-5, 6-7 (10), 7-5తో మార్టిన్‌ డామ్‌పైౖ నెగ్గి మూడో రౌండ్‌కు చేరారు. ఐదో సీడ్‌ జాక్‌ డ్రేపర్‌ ప్రత్యర్థికి రెండో రౌండ్‌లో వాకోవర్‌ ఇచ్చాడు.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంక 7-6 (4), 6-2తో కుడెర్మెటోవాపై సునాయాసంగా నెగ్గగా, లామెన్స్‌పై గెలిచేందుకు రెండో సీడ్‌ స్వియటెక్‌ 6-1, 4-6, 6-4తో మూడు సెట్లు పోరాడాల్సి వచ్చింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పెగుల 6-1, 6-3తో బ్లింకోవాని, ఆండ్రీవా 6-1, 6-3తో పొటపోవాని, పోలిని 6-3, 6-3తో జోవిక్‌ని, రిబకినా 6-3, 7-6 (7)తో వలెంటోవాని ఓడించి ముందంజ వేశారు. అన్‌సీడెడ్‌ అన్‌ లీ 6-3, 6-3తో 16వ సీడ్‌ బెన్సిక్‌ని, మరో అన్‌సీడెడ్‌ టేలర్‌ టౌన్‌సెండ్‌ 7-5 6-1తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ విజేత జెలెనా ఓస్టాపెంకోని కంగుతినిపించారు.


మెద్వెదెవ్‌కు రూ. 37 లక్షల జరిమానా: అనుచితంగా ప్రవర్తించిన రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు టోర్నీ రెఫరీ రూ. 37 లక్షల జరిమానా విధించారు. ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ బోన్జీ-మెద్వెదెవ్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఫొటోగ్రాఫర్‌ ఒకరు కోర్టులోకి వచ్చారు. దాంతో బోన్జీకి అంపైర్‌ గ్రెగ్‌ అదనంగా మొదటి సర్వీస్‌ ఇవ్వడంతో..మెద్వెదెవ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అంపైర్‌ వద్దకు వెళ్లి వాదన పెట్టుకోవడమేకాదు అతడిని దూషించాడు. ఇక..మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత అసహనంతో రాకెట్‌ను సైతం విరగ్గొట్టాడు. దాంతో అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు రూ. 26 లక్షలు, రాకెట్‌ విరగ్గొట్టినందుకు రూ. 11 లక్షల జరిమానాను మెద్వెదెవ్‌కు విధించారు.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:25 AM