Share News

US Open 2025: రిబకినాకు షాక్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:57 AM

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సీడెడ్‌ క్రీడాకారిణి ఇంటిబాట పట్టింది. వింబుల్డన్‌ మాజీ చాంపియన్‌, 9వ సీడ్‌ ఎలెనా రిబకినాకు నాలుగో రౌండ్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా షాకిచ్చింది....

US Open 2025: రిబకినాకు షాక్‌

క్వార్టర్స్‌కు సబలెంక, స్వియటెక్‌, అల్కారజ్‌

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సీడెడ్‌ క్రీడాకారిణి ఇంటిబాట పట్టింది. వింబుల్డన్‌ మాజీ చాంపియన్‌, 9వ సీడ్‌ ఎలెనా రిబకినాకు నాలుగో రౌండ్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా షాకిచ్చింది. వొండ్రుసోవా 4-6, 7-5తో రిబకినా (కజకిస్థాన్‌)ను కంగుతినిపించి యూఎస్‌ ఓపెన్‌లో రెండోసారి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, టాప్‌ సీడ్‌ సబలెంక (బెలారస్‌) 6-1, 6-4తో క్రిస్టియానా బుక్సా (స్పెయిన్‌)ను, రెండో సీడ్‌ స్వియటెక్‌ 6-3, 6-1తో ఎకటరీనా (రష్యా)ను ఓడించి క్వార్టర్స్‌ చేరారు. బార్బరా క్రెజికోవా (చెక్‌) 1-6, 7-6(13), 6-3తో టేలర్‌ టౌన్‌సెండ్‌పై అద్భుత విజయం సాధించింది.

నొవాక్‌ 64వసారి: పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌, సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌, టేలర్‌ ఫ్రిట్జ్‌ ముందంజ వేశారు. ఏడో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 6-3, 6-2తో జాన్‌ లెన్నార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై వరుస గేముల్లో నెగ్గి రికార్డుస్థాయిలో 64వసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌కు చేరుకొన్నాడు. అల్కారజ్‌ 7-6(3), 6-3, 6-4తో ఫ్రెంచ్‌ ప్లేయర్‌ ఆర్థర్‌ రెండర్‌కెచ్‌పై సునాయాసంగా నెగ్గాడు. ఈ క్రమంలో ఓపెన్‌ ఎరాలో 13సార్లు గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ చేరిన పిన్నవయస్కుడిగా 22 ఏళ్ల అల్కారజ్‌ రికార్డులకెక్కాడు. అమెరికా ప్లేయర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 6-4, 6-3, 6-3తో 21వ సీడ్‌ థామస్‌ మచాక్‌ (చెక్‌)పై, అలెక్స్‌ డి మినార్‌ 6-3, 6-2, 6-2తో లియాండ్ర రైడీపై గెలిచారు. 15వ సీడ్‌ రుబ్లేవ్‌ 5-7, 3-6, 4-6తో ఫెలిక్స్‌ అగర్‌ అల్‌అస్సమీ చేతిలో ఓడాడు. డబుల్స్‌ రెండో రౌండ్‌లో ఇండో-ఆసీస్‌ జోడీ యుకీ భాంబ్రి-మైకేల్‌ వీనస్‌ 6-1, 7-5తో ఎస్కోబార్‌-మిగ్వెల్‌ వరేలాను ఓడించింది.


మాయ ముందంజ

జూనియర్స్‌ సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ మాయా రాజేశ్వరన్‌ రేవతి రెండో రౌండ్‌కు చేరుకొంది. బాలికల విభాగం మొదటి రౌండ్‌లో మాయ 7-6(5), 6-3తో జాంగ్‌ క్వియాన్‌ (చైనా)పై గెలిచింది. కోయంబత్తూరుకు చెందిన మాయ స్పెయిన్‌లోని రఫెల్‌ నడాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకొంటోంది. బాలుర విభాగం తొలి రౌండ్‌లో హితేష్‌ 2-6, 4-6తో జెర్రీడ్‌ గెయిన్స్‌ (అమెరికా) చేతిలో, క్రిష్‌ త్యాగి 3-6, 1-6తో లుడ్విగ్‌ హెడే (స్పెయిన్‌) చేతిలో ఓడారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 04:57 AM