IPL 2025 RCB Vs DC Live: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ ఘన విజయం
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:32 PM
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన డీసీ జయకేతనం ఎగువ వేసింది.

తాజా ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి జయకేతనం ఎగురవేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన డీసీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో, ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫిల్ సాల్ట్ (24 బంతుల్లో 37 పరుగులు), విరాట్ కోహ్లీ (19 బంతుల్లో 28 పరుగులు) మంచి ఆరంభాన్నే ఇచ్చినా వారి నిష్క్రమణతో ఆర్సీబీ పతనం ప్రారంభమైంది. మిడిల్ ఓవర్స్‌లో బ్యాట్స్‌మన్ తడబడటంతో ఆర్సీబీ ఓటమి ఖరారైంది. రజత్ పటీదార్ (25), కృనాల్ పాండ్య (18) ఓ మోస్తరు ప్రయత్నం చేశారు. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, ముఖేశ్ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో డీసీ అదరగొట్టింది. 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సెక్సులతో విరుచుకుపడిన కేఎల్ రాహుల్ 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్టబ్స్ కూడా రాణించాడు. ఇన్నింగ్స్ మొదట్లో వరుసగా వికెట్లు పడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తడబడ్డారు. 89 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయి ఇబ్బందుల్లో పడ్డ సమయంలో రంగంలోకి దిగిన కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ రెండు, యశ్ దయాల్ సుయాశ్ శర్మ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
కింగ్ కోహ్లీ అద్భుతం.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి