Share News

Kohli 1000 IPL Boundaries: కింగ్ కోహ్లీ అద్భుతం.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు

ABN , Publish Date - Apr 10 , 2025 | 08:37 PM

డీసీతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ మ్యాచుల్లో వెయ్యి బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Kohli 1000 IPL Boundaries: కింగ్ కోహ్లీ అద్భుతం.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు
Virat Kohli 1000 IPL Boundaries

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. డీసీతో ప్రస్తుతం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రెండు బౌండరీలు సాధించి ఈ రికార్డు నెలకొల్పాడు. 920 బౌండరీలతో శిఖర్ ధవన్ రెండో స్థానంలో నిలవగా 899 ఐపీఎల్ బౌండరీలు బాదిన డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో 8 వేల పైచిలుకు పరుగులు చేసిన విరాట్ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసింది (Kohli 1000 IPL Boundaries).


కాగా, తాజాగా జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ అభిమానులను నిరాశే ఎదురైంది. ఢిల్లీ పేసర్ల ధాటికి ఆర్సీబీ తొలి ఒవర్లలోనే ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ స్కోరు 64గా నిలిచింది. అయితే, దూడుకుగా ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ విప్రోజ్ నిగమ్ వేసిన ఏడో ఓవర్‌లో చివరి బంతికి షాట్ కొట్టబోయి స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. మొదట్లో ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడినా 37 రనౌట్ కావడం ఆర్సీబీకి అతిపెద్ద షాక్‌గా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 09:21 PM