Share News

IPL - RCB: ఐపీఎల్ 2025.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఇకనైనా రాత మారేనా..?

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:37 PM

మళ్లీ విరాట్ కోహ్లీనే బెంగళూరు కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వస్తున్న వేళ ఆర్సీబీ కొత్త నాయకుడితో ముందుకు వచ్చింది. యువ బ్యాటర్ రజిత్ పటీదార్‌‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

IPL - RCB: ఐపీఎల్ 2025.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఇకనైనా రాత మారేనా..?
Rajat Patidar as RCB new Captain

ఐపీఎల్‌ (IPL 2025)లో ఒక్క టైటిల్ కూడా సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) కొత్త కెప్టెన్ వచ్చేశాడు. మళ్లీ విరాట్ కోహ్లీనే బెంగళూరు కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వస్తున్న వేళ ఆర్సీబీ కొత్త నాయకుడితో ముందుకు వచ్చింది. యువ బ్యాటర్ రజిత్ పటీదార్‌ (Rajat Patidar)కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది (RCB Captain).


గత సీజన్‌లో ఆర్సీబీకి కెప్టెన్ అయిన డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ ఖాయం అని అందరూ అనుకున్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలు కెప్టెన్ రేసులో నిలిచారు. మరోసారి కోహ్లీ వైపు ఆర్సీబీ మొగ్గు చూపుతుందని కూడా చాలా మంది అనుకున్నారు. అయితే అనూహ్యంగా యువ బ్యాటర్ రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


31 ఏళ్ల రజత్ పటీదార్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. 2023లో టీమిండియా తరఫున వన్డేలోకి అరేంగేట్రం చేశాడు. 2024లో టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లోకి 2021లో అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 27 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రజత్ పటీదార్ 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేదు. మరి, కొత్త కెప్టెన్ అయినా ఆర్సీబీ రాత మారుస్తాడేమో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 12:37 PM