Rohit Sharma at hospital: ముంబైలో హాస్పిటల్ ముందు రోహిత్.. అసలేం జరిగింది..?
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:47 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లోపలికి వెళుతూ రోహిత్ కెమెరాలకు చిక్కాడు. హాస్పిటల్ లోపలికి వెళుతున్న రోహిత్‌ను బయట ఉన్న వారు ప్రశ్నలు అడిగారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ (Kokilaben Hospital) లోపలికి వెళుతూ రోహిత్ కెమెరాలకు చిక్కాడు. హాస్పిటల్ లోపలికి వెళుతున్న రోహిత్‌ను బయట ఉన్న వారు ప్రశ్నలు అడిగారు. అయితే వారికి సమాధనం చెప్పకుండా రోహిత్ నేరుగా హాస్పిటల్ లోపలికి వెళ్లిపోయాడు. దీంతో రోహిత్ అసలు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడనే విషయంపై క్లారిటీ రాలేదు (Rohit Sharma hospital visit).
దాదాపు నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఆసీస్‌తో తలపడే భారత వన్డే జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అందుకోసం ఫిట్‌నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. ఇలాంటి సమయంలో రోహిత్ హాస్పిటల్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను పరామర్శించేందుకే రోహిత్ హాస్పిటల్‌కు వెళ్లి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు (Rohit Sharma health).
ఇప్పటికే అంతర్జాతీయ టీ-20లు, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ పూర్తిగా వన్డేల పైనే దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడు (Rohit Sharma fitness test). 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ కోరుకుంటున్నాడు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఎలా రాణిస్తాడనే దానిపై రోహిత్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
చేతిలో గన్.. ఛేజింగ్.. సరికొత్త అవతారంలో ధోనీ.. టీజర్ అదిరిపోయిందిగా..
ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్‌పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..