Rohit Sharma: హిట్‌మ్యాన్ గుడ్ బై..!
ABN , Publish Date - Oct 26 , 2025 | 07:10 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన సిడ్నీకి వీడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన సిడ్నీ(Sydney)కి వీడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన సోషల్ మీడియా(Social Media) ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘చివరిసారిగా సిడ్నీ నగరానికి వీడ్కోలు పలుకుతున్నాను’ అంటూ క్యాప్షన్‌తో గుడ్ బై చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్.. సిడ్నీ కింగ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిడ్నీ గ్రౌండ్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ.. ఆరు అర్థ శతకాలు, రెండు శతకాలు సహా 752 పరుగులు చేశాడు. సిడ్నీ మైదానంలో హిట్‌మ్యాన్ 64 ఫోర్లు, 24 సిక్స్‌లు బాదాడు.
నిలబడి గెలిచాడు..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ గ్రౌండ్‌లోనే టెస్ట్‌కు తుది జట్టు నుంచి రోహిత్ స్వయంగా తప్పుకున్నాడు. తాజాగా పర్యటనలో ఇదే మైదానంలో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో తగ్గిన చోటే నిలబడి గెలిచాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు.
మళ్లీ ఆడుతామో లేదో..
‘నాకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమే. సిడ్నీలో ఆడటం సంతోషంగా ఉంటుంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఇక్కడకు వస్తామో లేదో తెలియదు. కానీ నేను ఈ గడ్డపై ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు’ అని రోహిత్ తెలిపాడు.
Also Read:
KTR: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోంది: కేటీఆర్
Reasons Not to Sit On Doorstep: ఇంటి గడపపై ఎందుకు కూర్చోకూడదు?