Share News

Rishabh Pant: సారీ చెప్పిన పంత్.. ఎందుకంటే?

ABN , Publish Date - Nov 27 , 2025 | 07:53 PM

సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తాము రాణించలేదని.. ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.

Rishabh Pant: సారీ చెప్పిన పంత్.. ఎందుకంటే?
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా, గువాహటి వేదికలుగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా ఘెర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సఫారీల ధాటికి కుప్పకూలిన టీమిండియా.. వైట్ వాష్ అయింది. ఈ ఓటమి తర్వాత భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant ) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల్లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయామని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘గత రెండు వారాలుగా మేం సరిగ్గా ఆడలేదన్న మాట వాస్తవం. జట్టుగానే కాదు.. వ్యక్తిగతంగానూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని.. కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలనేదే మా ఆశయం. కానీ ఈ సారి మేం మీ అంచనాలను అందుకోలేకపోయాం. అందుకు మమ్మల్ని క్షమించండి. కానీ ఆటల్లో ఓటమి ఎప్పుడూ ఓ కొత్త గుణపాఠం నేర్పుతూనే ఉంటుంది. మరింత మెరుగవ్వాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఈ జట్టు సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. మేం మరింత కష్టపడుతాం. మా ఆటపై మరింత ఫోకస్ పెడతాం. నేలకు కొట్టిన బంతిలా తిరిగి వస్తాం. మీ అమితమైన మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. జై హింద్’ అని పంత్ పేర్కొన్నాడు.


టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతోంది. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్‌తో కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. బుమ్రా, సిరాజ్, శుభ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపించనున్నాడు.


ఇవి కూడా చదవండి:

దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ

డబ్ల్యూపీఎల్ ఎప్పటినుంచంటే..?

Updated Date - Nov 27 , 2025 | 07:53 PM