Rain Disrupts Ranji Matches: రంజీలకు వర్షం దెబ్బ
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:52 AM
తెలుగు రాష్ర్టాల రంజీ మ్యాచ్‌ల మూడోరోజు వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో పుదుచ్చేరితో హైదరాబాద్, బరోడాతో ఆంధ్ర జట్లు తలపడుతున్న మ్యాచ్‌లు డ్రా దిశగా సాగుతున్నాయి. కేవలం 25 ఓవర్లపాటు...
25 ఓవర్లే సాధ్యమైన హైదరాబాద్ మ్యాచ్
ఆంధ్ర ఆటలో ఒక్క బంతీ పడని వైనం
పుదుచ్చేరి: తెలుగు రాష్ర్టాల రంజీ మ్యాచ్‌ల మూడోరోజు వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో పుదుచ్చేరితో హైదరాబాద్, బరోడాతో ఆంధ్ర జట్లు తలపడుతున్న మ్యాచ్‌లు డ్రా దిశగా సాగుతున్నాయి. కేవలం 25 ఓవర్లపాటు సాగిన మూడో రోజు ఆటలో పున్నయ్య (3/10)తోపాటు మిగతా బౌలర్లు రాణించడంతో.. గ్రూప్-డిలో పుదుచ్చేరితో రంజీలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 25/1తో ఆట కొనసాగించిన పుదుచ్చేరి 92/8తో కష్టాల్లో పడింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 435 పరుగులు చేసింది. కాగా, వర్షం కారణంగా గ్రూప్-ఎలో ఆంధ్ర-బరోడా మధ్య ఆట పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులు సాధించగా.. ఆంధ్ర 43/2 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ విజయనగరంలో జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News