Rain Disrupts India vs Bangladesh Match: వరుణుడిదేఆట
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:32 AM
మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో భారత్ ఆడిన చివరి గ్రూప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ నామమాత్రపు మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. హర్మన్‌ప్రీత్ సేన ఇప్పటికే...
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
మహిళల వన్డే వరల్డ్‌కప్
నవీ ముంబై: మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో భారత్ ఆడిన చివరి గ్రూప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ నామమాత్రపు మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. హర్మన్‌ప్రీత్ సేన ఇప్పటికే సెమీ్‌సకు చేరిన సంగతి తెలిసిందే. వర్షంతో అర్ధగంట ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో..బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో దాదాపు రెండున్నర గంటలపాటు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో బంగ్లా 9 వికెట్ల నష్టానికి 119 పరుగులకే పరిమితమైంది. తాజా ప్రపంచక్‌పలో తొలి మ్యాచ్ ఆడిన స్పిన్నర్ రాధా యాదవ్‌కు మూడు, శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి. బంగ్లా ఇన్నింగ్స్‌లో షర్మీన్ అక్తర్ (36), సొభానా మోస్తరి (26) మాత్రమే రాణించారు. స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఛేదనలో భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 126 పరుగుల టార్గెట్‌ను విధించారు. ఓపెనర్ మంధాన (34 నాటౌట్) ఆరంభం నుంచే చెలరేగి నాలుగో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 16 రన్స్ రాబట్టింది. అయితే 8.4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసిన వేళ వర్షం మరోసారి ఆటంకం కలిగింది. ఆ తర్వాత పరిస్థితులు ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ప్రతీకా స్థానంలో అమన్‌జోత్ (15 నాటౌట్) ఓపెనర్‌గా బరిలోకి దిగింది.
ప్రతీకా రావల్‌కు గాయం
ఆస్ట్రేలియాతో కీలక సెమీఫైనల్స్‌కు ముందు భారత్‌కు ఝలక్ తగిలింది. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ప్రతీకా రావల్ గాయపడింది. బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపే ప్రయత్నంలో మోకాలికి గాయం కావడంతో పాటు చీలమండ మెలి తిరగడంతో ఆమె మైదానంలోనే కుప్పకూలింది. ఆ వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించిన తర్వాత రావల్ నడవడానికి ఇబ్బందిపడుతూనే డగౌట్‌కు వెళ్లింది.
స్కోరుబోర్డు
బంగ్లాదేశ్: సుమయా అక్తర్ (సి) శ్రీచరణి (బి) రేణుక 2, రుబియా హైదర్ (సి) హర్లీన్ (బి) దీప్తి 13, షర్మిన్ అక్తర్ (సి/సబ్) అరుంధతి (బి) శ్రీచరణి 36, నిగర్ సుల్తానా (రనౌట్) 9, సొభానా మోస్తరీ (సి) హర్లీన్ (బి) రాధ 26, షోర్నా అక్తర్ (బి) అమన్‌జోత్ 2, నహిదా అక్తర్ (బి) రాధ 3, రబేయా ఖాన్ (బి) రాధ 3, రీతూ మోని (సి) జెమీమా (బి) శ్రీచరణి 11, నిషితా అక్తర్ (నాటౌట్) 4, మరూఫా అక్తర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 27 ఓవర్లలో 119/9; వికెట్ల పతనం: 1-3, 2-34, 3-53, 4-91, 5-94, 6-99, 7-101, 8-105, 9-117; బౌలింగ్: రేణుక 5-0-23-1, దీప్తి శర్మ 5-2-24-1, అమన్‌జోత్ 5-0-18-1, శ్రీచరణి 6-0-23-2, రాధా యాదవ్ 6-0-30-3.
భారత్: స్మృతి మంధాన (నాటౌట్) 34, అమన్‌జోత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 8.4 ఓవర్లలో 57/0; బౌలింగ్: మరూఫా అక్తర్ 2-0-15-0, నిషితా అక్తర్ 2-0-18-0, నహిదా అక్తర్ 2-0-12-0, రబేయా ఖాన్ 1.4-0-7-0, రీతూ మోని 1-0-5-0.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News