Share News

Victory Over World No 2: అదరగొట్టిన సింధు

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:22 AM

గత కొంత కాలంగా ఫామ్‌ కోసం తంటాలుపడుతున్న భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ సీజన్‌లో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచింది. అలనాటి పవర్‌ గేమ్‌ను మరోసారి ప్రదర్శించిన సింధు.. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో రెండో సీడ్‌ వాంగ్‌ జి యి (చైనా)కు...

Victory Over World No 2: అదరగొట్టిన సింధు

వరల్డ్‌ నెం: 2పై విజయంతో క్వార్టర్స్‌కు..

సాత్విక్‌, ధ్రువ్‌ జోడీలు కూడా..

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్స

పారిస్‌: గత కొంత కాలంగా ఫామ్‌ కోసం తంటాలుపడుతున్న భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ సీజన్‌లో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచింది. అలనాటి పవర్‌ గేమ్‌ను మరోసారి ప్రదర్శించిన సింధు.. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో రెండో సీడ్‌ వాంగ్‌ జి యి (చైనా)కు షాకిస్తూ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ జోడీ, మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల జంట సంచలన విజయాలతో రౌండ్‌-8కు చేరుకొన్నాయి. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 15వ ర్యాంకర్‌ సింధు 21-19, 21-15తో వాంగ్‌ జి యిని వరుస గేముల్లో చిత్తు చేసింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో పుత్రి కుసుమవర్ధని (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది. పురుషుల డబుల్స్‌ రౌండ్‌-16లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ 21-15, 21-17తో ఆరో సీడ్‌. చైనా జోడీ లియాంగ్‌ వి కెంగ్‌-వాంగ్‌ చాంగ్‌కు ఝలక్‌ ఇచ్చింది. తొలి గేమ్‌లో ఓడినా.. భారత జంట అద్భుతంగా పుంజుకొని మిగతా రెండు గేమ్‌లు గెలిచింది. ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జంట 19-21, 21-12, 21-15తో హాంకాంగ్‌కు చెందిన టాంగ్‌ చున్‌ మన్‌-సె యింగ్‌ సూట్‌పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 7-21, 21-17, 21-23తో వరల్డ్‌ నెం:2 అంటాన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:22 AM