BWF World Championships: సింధు ప్రణయ్ ముందంజ
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:08 AM
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్ సింధు 23-21, 21-6తో కలోయనా నల్బంటోవా...
వరల్డ్ చాంపియన్‌షి్‌ప
పారిస్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భారత ఏస్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్ సింధు 23-21, 21-6తో కలోయనా నల్బంటోవా (బల్గేరియా)పై వరుస గేమ్‌ల్లో గెలిచింది. తొలి గేమ్ ఆరంభంలో తడబడిన సింధు 0-4తో వెనుకబడింది. అయితే, 2-6తో ఉన్న సమయంలో నల్బంటోవా తప్పిదాలతో సింధు 5-7తో ఆధిక్యం తగ్గించింది. కానీ, బల్గేరియా షట్లర్ 11-7తో బ్రేక్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత పవర్‌ఫుల్ స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు 12-12తో స్కోరు సమం చేసింది. 20-20 వద్ద మరోసారి స్కోరు సమం చేసిన సింధు.. గేమ్‌ను తన ఖాతాలో వేసుకొంది. రెండో గేమ్‌లో సింధు జోరుకు నల్బంటోవా చేతులెత్తేసింది. ఇక పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ప్రణయ్ 21-18, 21-15తో జొయాకిమ్ ఓల్డోర్ఫ్ (ఫిన్లాండ్)పై సులువుగా నెగ్గాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని జోడీ 18-21, 21-16, 21-18తో లియాంగ్-వెంగ్ చి నెగ్‌పై గెలిచి ముందంజ వేసింది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి