PV Sindhu China Masters: సింధు ముందంజ
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:49 AM
గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో ఆరంభ రౌండ్లోనే నిష్క్రమించిన పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది...
షెన్‌జెన్ (చైనా): గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో ఆరంభ రౌండ్లోనే నిష్క్రమించిన పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్‌లో సింధు 21-5, 21-10తో జూలీ డావల్ (డెన్మార్క్)పై గెలిచింది. ఇక ఆయుష్ షెట్టి 19-21, 21-12, 16-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ రుత్వికా శివాని/రోహన్ 17-21, 11-21తో జపాన్ జంట యుచి షిమొగామి/సయాక హొబర చేతిలో ఓడి ఆదిలోనే వెనుదిరిగింది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి