Puneri Paltan Defeat: బెంగాల్‌పై పుణెరి గెలుపు
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:57 AM
ప్రొ కబడ్డీ లీగ్-12 తొలి అంచెలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 45-36 స్కోరుతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఆట ప్రారంభం నుంచి పల్టన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి వారియర్స్‌పై...
విశాఖపట్నం
స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్-12 తొలి అంచెలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 45-36 స్కోరుతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఆట ప్రారంభం నుంచి పల్టన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి వారియర్స్‌పై ఒత్తిడి పెంచారు. ప్రథమార్ధం 26-22 స్కోరుతో ముగిసింది. ద్వితీయార్ధంలో పుంజుకునేందుకు యత్నించిన బెంగాల్ వారియర్స్‌ను పుణెరి డిఫెండర్లు నిలువరించారు. వారియర్స్ కెప్టెన్, స్టార్ రైడర్ దేవంక్ పలుమార్లు ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయారు. పుణెరి జట్టులో అస్లాం ఇనాందార్, ఆదిత్య షిండే చెరో 11 పాయింట్లు సాధించారు. హరియాణా స్టీలర్స్-యు ముంబా జట్ల మ్యాచ్ 36-36తో టైగా ముగిసింది. అయితే షూటౌట్‌లో హరియాణా విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి