Pro Kabaddi League: విశాఖలో నేటి నుంచి ప్రొ కబడ్డీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:17 AM
విశాఖ పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-12 జరగనున్నది. తొలి అంచెలో భాగంగా...
ట్రోఫీతో కబడ్జీ జట్ల సారథులు
విశాఖపట్నం-స్పోర్ట్సు (ఆంధ్రజ్యోతి): విశాఖ పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-12 జరగనున్నది. తొలి అంచెలో భాగంగా సెప్టెంబరు 11 వరకు ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. బీచ్‌రోడ్డులోని ఐఎన్‌ఎస్ కురుసురా సబ్‌మెరైన్ వద్ద ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం పీకేఎల్ చైర్మన్ అనుపమ గోస్వామితోపాటు 12 జట్ల సారథులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఆటగాళ్లు భారత సాయుధ దళాలకు నివాళులర్పించారు. ఈ సీజన్‌లో అన్ని జట్లు పటిష్ఠంగా ఉన్నాయని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, తమిళ్ తలైవాస్ సారథి పవన్ సెహ్రావత్ అన్నారు. జొమోటా డిస్ర్టిక్ట్ వెబ్‌సైట్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్, 9 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్-పుణెరి పల్టన్ జట్లు తలపడతాయి.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి