Womens ODI World Cup 2025: ఒత్తిడిలో హర్మన్ సేన
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:28 AM
వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పోటీ పడనుంది...
నేడు ఇంగ్లండ్‌తో భారత్ కీలక పోరు
మ. 3 నుంచి
స్టార్ నెట్‌వర్క్‌లో
మహిళల వన్డే ప్రపంచ కప్
ఇండోర్: వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పోటీ పడనుంది. సెమీస్ చేరాలంటే హర్మన్‌ప్రీత్ సేన తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు ఆరో బౌలర్‌తో బరిలోకి దిగాలనుకొంటోంది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. టాపార్డర్ స్మృతి మంధాన, ప్రతీక రావల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ నిలకడలేని ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ఓటమి లేకుండా సాగుతున్న ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ దాదాపు ఖరారవుతుంది. పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో బ్రంట్ సారథ్యంలోని ఇంగ్లండే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగం తడబాటుకు గురవుతున్నా..బౌలింగ్ మెరుగ్గా ఉంది.
పాక్-కివీస్ మ్యాచ్ వర్షార్పణం
సెమీ్‌సకు దక్షిణాఫ్రికా
కొలంబో: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో కొలంబో వేదికపై జరుగుతున్న మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే ఈ వేదికపై ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దవగా.. తాజాగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 25 ఓవర్లలో 92/5 స్కోరు దగ్గర ఉన్నప్పుడు భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు వేచిచూసినా వరుణుడు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రియాజ్ (28), మునీబా (22) రాణించగా, తహుహుకు 2 వికెట్లు దక్కాయి. మ్యాచ్ రద్దుతో పాక్ ఆశలు అడుగంటిపోగా.. కివీస్ టోర్నీలో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా ఫలితంతో.. 8 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆసీస్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News