Share News

Womens ODI World Cup: ప్రతీకా రావల్‌ అవుట్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 02:54 AM

Prateekaa Rawal Injured, Shafali Verma Replaces Her in India Womens World Cup Squad

Womens ODI World Cup: ప్రతీకా రావల్‌ అవుట్‌

  • జట్టులోకి షఫాలీ వర్మ

  • మహిళల వన్డే వరల్డ్‌కప్‌

న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో కీలక సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో మరో ఓపెనర్‌ షఫాలీ వర్మను తీసుకున్నారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన భారత్‌ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ప్రతీకా గాయపడింది. బౌండరీ లైన్‌ దగ్గర బంతిని ఆపే క్రమంలో కుడి చీలమండ మెలిక పడడంతోపాటు మోకాలికి కూడా గాయమైంది. దీంతో పెవిలియన్‌కు చేరిన రావల్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

For More Sports News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 02:54 AM