Masters Badminton: ప్రణయ్ లక్ష్య శుభారంభం
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:09 AM
భారత స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ జపాన్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్...
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
కుమమొటో (జపాన్): భారత స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ జపాన్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ లక్ష్య 21-12, 21-16తో స్థానిక షట్లర్ కొకి వతనబెపై, ప్రణయ్ 16-21, 21-13, 23-21తో జున్ హావో లియోంగ్ (మలేసియా)పై గెలిచారు. లక్ష్య, ప్రణయ్ మినహా తొలిరోజు బరిలోకి దిగిన మిగతా భారత షట్లర్లంతా విఫలమయ్యారు. సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, ఆయుష్ శెట్టి, తరుణ్ మన్నేపల్లి, మిక్స్‌డ్ డబుల్స్‌లో రుత్వికా శివాని/రోహన్ కపూర్ ఇంటిబాట పట్టారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి