Sinquefield Cup 2025: గుకే్‌షపై ప్రజ్ఞానంద గెలుపు
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:43 AM
సింక్వెఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ గుకే్‌షకు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో గుకే్‌షను కేవలం 36 ఎత్తుల్లోనే చిత్తు చేశాడు...
సింక్వెఫీల్డ్ కప్ చెస్
సెయింట్ లూయిస్ (యూఎ్‌సఏ): సింక్వెఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ గుకే్‌షకు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో గుకే్‌షను కేవలం 36 ఎత్తుల్లోనే చిత్తు చేశాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లాడు. ఇతర తొలి రౌండ్ గేమ్‌లలో నోదిర్బెక్‌పై అరోనియన్ నెగ్గగా.. కరువానాతో డూడా, శామ్యూల్‌తో వెస్లీ, మాగ్జిమ్‌తో అలీ రెజా గేమ్‌లను డ్రాగా ముగించారు. ఆరంభ రౌండ్ ముగిసేసరికి ప్రజ్ఞానంద, అరోనియన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News