Praggnanandhaa: గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:10 AM
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సింక్వెఫీల్డ్ కప్‌లో రన్నర్‌పగా నిలవడంతో ప్రజ్ఞానందకు గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ బెర్త్ ఖాయమైంది. అమెరికా గ్రాండ్‌మాస్టర్...
ప్రజ్ఞానంద అర్హత
సెయింట్ లూయిస్ (యూఎస్): భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సింక్వెఫీల్డ్ కప్‌లో రన్నర్‌పగా నిలవడంతో ప్రజ్ఞానందకు గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ బెర్త్ ఖాయమైంది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో సింక్వెఫీల్డ్ కప్ టైటిల్ దక్కించుకున్నాడు. తొమ్మిదో, తుది రౌండ్‌లో అబ్దుసత్తోరోవ్‌పై నెగ్గిన వెస్లీ సో..ప్రజ్ఞానంద, తన దేశానికే చెందిన కరువానాతో కలిసి 5.5 పాయింట్లతో సమంగా నిలిచాడు. దాంతో..ప్లేఆఫ్ నిర్వహించగా రెండు పాయింట్లకుగాను వెస్లీ 1.5 పాయింట్లు సాధించి కప్ అందుకున్నాడు. ఇక..టైబ్రేకర్‌లో లెవాన్ అరోనియన్ (అమెరికా)తో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద..కరువానపై నెగ్గి రన్నర్‌పగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి