Sinquefield Cup 2025: ప్రజ్ఞానందకు వరుసగా ఐదో డ్రా
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:19 AM
సింక్యుఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా ఐదో గేమ్‌ను డ్రా చేసుకొన్నాడు. ఆరో రౌండ్‌లో పోలెండ్ జీఎం జాన్ క్రెజిస్ టోఫ్‌తో ప్రజ్ఞానంద పాయింట్ పంచుకొన్నాడు...
సెయింట్ లూయిస్ (యూఎస్): సింక్యుఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా ఐదో గేమ్‌ను డ్రా చేసుకొన్నాడు. ఆరో రౌండ్‌లో పోలెండ్ జీఎం జాన్ క్రెజిస్ టోఫ్‌తో ప్రజ్ఞానంద పాయింట్ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 32 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించాడు. అలీరెజా ఫిరోజా (ఫ్రాన్స్)తో గేమ్‌ను వరల్డ్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజు డ్రాగా ముగించాడు. మొత్తం ఆరు రౌండ్ల నుంచి ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో, గుకేష్ 3 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..