Pooja Rani Semifinal in World Boxing: సెమీఫైనల్లో పూజ
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:27 AM
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు మూ డో పతకం ఖాయమైంది. మహిళల 80 కి. విభాగంలో పూజారాణి సెమీఫైనల్‌కు చేరిం ది. బుధవారం అర్ధరాత్రి హోరాహోరీగా జరిగిన...
భారత్‌కు మరో పతకం ఖాయం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్స
లివర్‌పూల్ (ఇంగ్లండ్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు మూ డో పతకం ఖాయమైంది. మహిళల 80 కి. విభాగంలో పూజారాణి సెమీఫైనల్‌కు చేరిం ది. బుధవారం అర్ధరాత్రి హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల పూజ 3-2తో ఎమీలియా కొటెర్‌స్కా (పోలెండ్) ఓడించింది. సెమీ్‌సకు చేరిన పూజారాణికి కనీసం కాంస్యం లభించనుంది. ప్రపంచ పోటీలలో ఆమెకిదే తొలి పతకం. ఇక జైస్మీన్ లంబోరియా (మహిళల 57కి.), నూపుర్ షెరాన్ (మహిళల 80+కి.) ఇంతకుముందే సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖరారైన సంగతి తెలిసిందే. పురుషుల 65కి. కేటగిరీ క్వార్టర్‌ఫైనల్లో అభినాష్ జమ్వల్ 1-4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాష గురులీ (జార్జియా) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి