Share News

US Open Semifinals: సెమీస్‌కు పెగుల

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:54 AM

గతేడాది రన్నరప్‌, నాలుగో సీడ్‌ జెస్సికా పెగుల వరుసగా రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో లోకల్‌ స్టార్‌ పెగుల 6-3, 6-3తో చెక్‌ భామ బార్బరా క్రెజికోవాపై వరుస సెట్లలో...

US Open Semifinals: సెమీస్‌కు పెగుల

క్వార్టర్స్‌లో సినర్‌, ఒసాక

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: గతేడాది రన్నరప్‌, నాలుగో సీడ్‌ జెస్సికా పెగుల వరుసగా రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో లోకల్‌ స్టార్‌ పెగుల 6-3, 6-3తో చెక్‌ భామ బార్బరా క్రెజికోవాపై వరుస సెట్లలో సునాయాసంగా నెగ్గింది. తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే క్రెజికోవా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన పెగుల 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, క్రమంగా పుంజుకొన్న బార్బరా ఏడో గేమ్‌లో పెగుల సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 3-4తో సమం చేసేలా కనిపించింది. కానీ, మరోసారి బ్రేక్‌ పాయింట్‌ సాధించిన పెగుల సెట్‌ను తన ఖాతాలో వేసుకొంది. ఇక రెండో సెట్‌ మొదటి గేమ్‌లోనే క్రెజికోవాకు చెక్‌ చెప్పిన జెస్సికా 2-0తో ముందంజ వేసింది. ఐదో గేమ్‌లో మరో బ్రేక్‌ పాయింట్‌తో పెగుల 4-1తో ఆధిక్యం సాధించింది. అయితే, ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన క్రెజికోవా 3-4తో పోటీలోకి వచ్చేలా కనిపించింది. ఆ తర్వాతి గేమ్‌లో సర్వీ్‌సను నిలబెట్టుకొన్న అమెరికా ప్లేయర్‌.. 9వ గేమ్‌లో క్రెజికోవా మరోసారి బ్రేక్‌ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.


గాఫ్‌కు ఒసాక షాక్‌: ప్రీ క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ యానిక్‌ సినర్‌ 6-1, 6-1, 6-1తో అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్థాన్‌)ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. కాగా, 10వ సీడ్‌ లెరెంజో ముసెట్టి (ఇటలీ) 6-3, 6-0, 6-1తో జేమ్‌ మునార్‌పై గెలిచాడు. క్వార్టర్స్‌లో ముసెట్టితో సినర్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ కొకొ గాఫ్‌కు నవోమి ఒసాక షాకిచ్చింది. రౌండ్‌-16లో 23వ సీడ్‌ ఒసాక 6-3, 6-2తో గాఫ్‌పై అలవోకగా గెలిచింది. 8వ సీడ్‌ అమందా అనిసిమోవా 6-0, 6-3తో బియాట్రిజ్‌ హడాడ్‌పై, 11వ సీడ్‌ కరోలినా ముచోవా 6-3, 6-7(0), 6-3తో మర్టా కోస్తుక్‌పై నెగ్గారు. రౌండ్‌-8లో ముచోవాతో ఒసాక తలపడనుంది. మహిళల డబుల్స్‌లో వీనస్‌ విలియమ్స్‌-లైలా ఫెర్నాండెజ్‌ జోడీ 6-3, 6-4తో ఎకటరీనా అలెగ్జాండ్రోవా-జాంగ్‌ షుయ్‌పై గెలిచింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 03:54 AM