Share News

PCB: బాంబు పేలుడు.. షెడ్యూల్‌ను మార్చిన పీసీబీ

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:58 PM

ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు ముక్కోణపు సిరీస్‌ వేదికను రావల్పిండికి మార్చింది. జింబాబ్వే, శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ సిరీస్ నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.

PCB: బాంబు పేలుడు.. షెడ్యూల్‌ను మార్చిన పీసీబీ
PCB

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వే, శ్రీలంక, పాకిస్తాన్.. ముక్కోణపు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. దీనికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. తాజాగా ఈ వేదికను పీసీబీ ఇస్లామాబాద్ నుంచి రావల్పిండి(Rawalpindi)కి తరలించింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు సంభవించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించి మార్పులు చేసిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) గురువారం విడుదల చేసింది.


అఫ్గానిస్తాన్ పాల్గొనాల్సింది.. కానీ!

ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు నేపథ్యంలో తమ ఆటగాళ్లు పాక్‌ను విడిచి స్వదేశానికి రావడానికి విజ్ఞప్తి చేస్తున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) తెలిపింది. వాస్తవానికి ఈ సిరీస్‌లో మొదట ఈ సిరీస్‌లో జింబాబ్వే స్థానంలో అఫ్గానిస్తాన్ పాల్గొనాల్సి ఉంది. కానీ గత నెలలో పాక్ జరిపిన వైమానిక దాడుల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు మృతి చెందడంతో అఫ్గానిస్తాన్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంది. అయితే శ్రీలంక ఆటగాళ్లు స్వదేశానికి బయలు దేరనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్, శ్రీలంక వన్డే సిరీస్, త్వరలో ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ముక్కోణపు సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే..

18 నవంబర్‌: పాకిస్థాన్‌ vs జింబాబ్వే

20 నవంబర్‌: శ్రీలంక vs జింబాబ్వే

22 నవంబర్‌: పాకిస్థాన్‌ vs శ్రీలంక

23 నవంబర్‌: పాకిస్థాన్‌ vs జింబాబ్వే

25 నవంబర్‌: శ్రీలంక vs జింబాబ్వే

27 నవంబర్‌: పాకిస్థాన్‌ vs శ్రీలంక

29 నవంబర్‌: ఫైనల్‌


ఇవి కూడా చదవండి

అలా బతకడం చాలా కష్టం: సానియా మీర్జా

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 12:58 PM