Asia Cup Hockey: పాక్ స్థానంలో బంగ్లా ఖరారు
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:41 AM
భారత్‌లో జరిగే ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్, ఒమన్ జట్ల స్థానాల్లో బంగ్లాదేశ్, కజకిస్థాన్ బరిలోకి దిగనున్నాయి. ఈనెల 29 నుంచి సెప్టెంబరు 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్‌లో టోర్నీ జరగనుంది...
ఆసియా కప్ హాకీ
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్, ఒమన్ జట్ల స్థానాల్లో బంగ్లాదేశ్, కజకిస్థాన్ బరిలోకి దిగనున్నాయి. ఈనెల 29 నుంచి సెప్టెంబరు 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్‌లో టోర్నీ జరగనుంది. అయితే, పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేస్తామని భారత ప్రభుత్వం చెప్పినా.. ఆ జట్టు భద్రతా కారణాల సాకుతో టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో ఆ జట్టు బదులు బంగ్లాకు చోటు కల్పించినట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. అలాగే, ఒమన్ కూడా టోర్నీకి దూరమవడంతో కజకిస్థాన్‌కు ఆడే అవకాశం దక్కింది. మొత్తం 8 జట్లు పోటీపడే టోర్నీలో పూల్-ఎ నుంచి ఆతిథ్య భారత్, చైనా, జపాన్, కజకిస్థాన్.. పూల్-బి తరఫున డిఫెండింగ్ చాంప్ కొరియా, మలేసియా, తైపీ, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News