Pakistan Enters Super 4: చచ్చీ చెడీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:59 AM
ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు సూపర్-4లో ప్రవేశించింది. గ్రూప్-ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో యూఏఈని ఓడించింది. తొలుత పాకిస్థాన్ 20 ఓవర్లలో 146/9 స్కోరు...
సూపర్- 4కు పాకిస్థాన్
యూఏఈపై గెలుపు
21న భారత్‌తో మళ్లీ ఢీ
దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు సూపర్-4లో ప్రవేశించింది. గ్రూప్-ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో యూఏఈని ఓడించింది. తొలుత పాకిస్థాన్ 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. ఫఖర్ జమాన్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (20)తో కలిసి జమాన్ మూడో వికెట్‌కు కీలకమైన 61 పరుగులు జోడించాడు. చివర్లో షహీన్ షా అఫ్రీది (29 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ పోరాడే స్కోరు చేసింది. ఛేదనలో యూఏఈ 17.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాశర్ (20) మాత్రమే రాణించారు. షహీన్ షా అఫ్రీది, అబ్రార్, రౌఫ్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి రెండో స్థానంలో నిలిచింది. దరిమిలా సూపర్-4కు క్వాలిఫై అయ్యింది. ఈ గ్రూప్ నుంచి టాప్‌లో భారత్ ఉంది. వచ్చే ఆదివారం జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్‌తో పాక్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 146/9 (పఖర్ జమాన్ 50, షహీన్ షా అఫ్రీది 29 నాటౌట్, సల్మాన్ ఆఘా 20, జునైద్ సిద్దిఖీ 4/18, సిమ్రన్‌జీత్ 3/26).
యూఏఈ: 17.4 ఓవర్లలో 105 ఆలౌట్ (రాహుల్ చోప్రా 35, ధ్రువ్ పరాశర్ 20, అబ్రార్ అహ్మద్ 2/13, షహీన్ షా అఫ్రీది 2/16, హరీస్ రవూఫ్ 2/19).
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి