Pakistan Collapse: పాకిస్థాన్ చెత్తాట
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:40 AM
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి చెత్త ప్రదర్శన కనబరచింది. వెస్టిండీ్‌సపై టీ20 సిరీ్‌సను సొంతం చేసుకున్న ఆ జట్టు. మంగళవారం జరిగిన సిరీస్ నిర్ణాయక మూడో వన్డేలో కేవలం...
92 పరుగులకే ఆలౌట్
విండీ్‌సతో మూడో వన్డే
తరౌబా (ట్రినిడాడ్-టుబాగో): అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి చెత్త ప్రదర్శన కనబరచింది. వెస్టిండీ్‌సపై టీ20 సిరీ్‌సను సొంతం చేసుకున్న ఆ జట్టు. మంగళవారం జరిగిన సిరీస్ నిర్ణాయక మూడో వన్డేలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 202 పరుగుల భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత వెస్టిండీస్ 50 ఓవర్లలో 294/6 స్కోరు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ (120 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. జస్టిన్ గ్రీవ్స్ (43 నాటౌట్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు హోప్ అభేద్యంగా 110 పరుగులు జోడించాడు. ఛేదనలో యువ పేసర్ జేడెన్ సీల్స్ (6/18) ధాటికి పాకిస్థాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే చాప చుట్టేసింది. సల్మాన్ ఆఘా (30), నవాజ్ (23 నాటౌట్) ఆదుకోకపోయుంటే పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఈ విజయంతో..1991 తర్వాత పాకిస్థాన్‌పై వెస్టిండీస్ తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెల్చుకున్నట్టయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News